విశ్వానికి దివ్య యోగం

22 Jun, 2022 01:39 IST|Sakshi
పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగాసనాలు వేస్తున్న వెంకయ్య, కిషన్‌రెడ్డి, పీవీ సింధు, ఇంద్రసేనారెడ్డి తదితరులు 

యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌: ‘యోగా విద్యకు ఎల్లలు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. ఇది విశ్వవ్యాప్తంగా అనుసరణీయం’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.  సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవా రం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ  యోగాను ఐక్యరాజ్య సమితి వరకూ తీసుకెళ్లి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ప్రధాని  మోదీని అభినందిస్తున్నానన్నారు.

ప్రస్తుత తరం యోగా ప్రాధానాన్ని తెలుసుకునేలా ఈ ఏడాది యోగా థీమ్‌ను ‘యోగా ఫర్‌ స్పిరిట్యువాలిటీ’గా ఎంచుకున్నట్టు తెలిపారుæ. కోవిడ్‌ వల్ల శారీరకం గా, మానసికంగా సమస్యలు ఎదురయ్యాయని, ఈ నేపథ్యంలో ఒత్తిడి నివారణకు యోగా ఉపకరి స్తుందని చెప్పారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఆయుష్‌ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఈటల సహా పలువురు బీజేపీ నాయకులు, నటుడు అడివి శేషు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్చ్యువల్‌ సందేశాన్ని వినిపించారు.

మరిన్ని వార్తలు