దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం

2 Oct, 2022 07:39 IST|Sakshi

వరంగల్‌ జిల్లా నెక్కొండ దీక్ష వేదికపైనే ఘటన

నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించడంలేదని ఓ వీఆర్‌ఏ మనస్తాపానికి గురై గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గుండ్రపల్లి వీఆర్‌ఏ మహ్మద్‌ ఖాసీం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు  వీఆర్‌ఏలు రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఖాసీం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం నెక్కొండలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఖాసీం బ్లేడ్‌తో గొంతు కోసుకున్నారు. దీంతో తోటి వీఆర్‌ఏలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సీ మాఫర్హీన్‌ ఆస్పత్రికి చేరుకొని  వివరాలు సేకరించారు. 

ఇదీ చదవండి:  అన్ని అనుకూలతలు ఉన్నా వెనుకబడే దుస్థితి ఎందుకు?: సీఎం కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు