నిర్మల్: టెన్నిస్ కోర్టుకు మళ్లీ వీఆర్‌ఏలు

14 Apr, 2022 20:59 IST|Sakshi

సాక్షి,నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ టెన్నిస్‌ ఆట వ్యవహారం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిర్మల్‌ టెన్నిస్‌ కోర్టులో మళ్లీ వీఆర్‌ఏలకు డ్యూటీలు విధించారు. దీంతో వీఆర్‌ఏలు విధులకు హాజరయ్యారు. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారుఖీ తాను టెన్నిస్‌ ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్‌ఏలకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ చర్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా గురువారం సైతం వీఆర్‌ఏలకు టెన్నిస్‌ కోర్టు వద్ద డ్యూటీలు విధించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

తమకు టెన్నిస్‌ కోర్టు వద్దే ప్రతి సాయంత్రం డ్యూటీలు విధించారని.. అందుకోసమే ఏం చేయాలో తెలియక ఇక్కడే విధులు నిర్వహస్తామంటున్నారు వీఆర్‌ఏలు. అయితే తాము టెన్నిస్‌ కోర్టుకు వచ్చేసరికి ఇంకా కలెక్టర్‌ టెన్నిస్‌ కోర్టు వద్దకు రాలేదని వీఆర్‌ఏలు పేర్కొన్నారు. ప్రతి రోజూ డే అంతా ఇక్కడే డ్యూటీ చేస్తామని అన్నారు. వెనకాల ఇద్దరు.. నెట్‌ మధ్యలో ఇద్దరం ఉంటామని చెప్పారు. ఈ రోజు టెన్నిస్‌ కోర్టుకు నలుగురు వీఆర్‌ఏలు వచ్చామని అన్నారు. సాయంత్రం స్పెషల్‌ డ్యూటీ టెన్నిస్‌ కోర్టులో వేస్తారని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు