తెలంగాణ అబ్బాయి.. పోలాండ్‌ అమ్మాయి

14 Feb, 2021 12:50 IST|Sakshi
ఇద్దరు కుమారులతో కృష్ణకాంత్‌ దంపతులు

లండన్‌లో నివసిస్తున్న దంపతులు

సాక్షి, జవహర్‌నగర్‌: వారి ప్రేమకు ప్రాంతాలు, దేశాలు అడ్డురాలేదు. ఆ జంట జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతం అనేది చూడలేదు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్‌ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ నిమిత్తం 2002లో లండన్‌ వెళ్లారు. అక్కడ పోలాండ్‌కు చెందిన బార్బర అనే యువతిని ప్రేమించారు.

వీరిద్దరూ 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్‌ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్‌ సోదరుడు నరేష్‌ ప్రేమ వివాహం చేసుకుని లండన్‌ సిటిజన్‌షిప్‌ (బ్రిటన్‌ పౌరసత్వం) తీసుకుని అక్కడే నివాసముంటున్నారు. ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లండన్‌లోని కృష్ణకాంత్, బార్బర దంపతులను ‘సాక్షి’ ఫోన్‌లో పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు. 

చదవండి: బెబ్బులి మళ్లీ వచ్చింది..!

‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు