వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా

28 Jul, 2020 09:18 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బత్తుల శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ తన రాజీనామాను అంగీకరించాలని ఆయన డీఎంఈకి లేఖ రాశారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్ల రాజీనామాలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురై నిజామాబాద్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.
(చిన్నారికి సరికొత్త జీవితం!)

మరిన్ని వార్తలు