గ్రేటర్ వరంగల్‌‌ ఫైట్‌: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?

19 Apr, 2021 08:02 IST|Sakshi
నామినేషన్‌ పత్రాలతో ప్రణయ్‌భాస్కర్‌  కుమారుడు అభినవ్‌భాస్కర్‌

వరంగల్‌ : గ్రేటర్‌ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్‌ పదవుల కోసం ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు అదివారం మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి 29వ డివిజన్‌ కార్పొరేటర్‌గా నామినేషన్‌ అందజేశారు. అలాగే, దివంగత మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ కుమారుడు అభినవ్‌భాస్కర్‌ 60 డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ సమర్పించారు.

ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి సోదరి నల్లా స్వరూపరాణి 57వ డివిజన్‌ నుంచి, మాజీ డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌ 10వ డివిజన్‌ నుంచి, మాజీ స్టాండింగ్‌ కమిటి చైర్మన్‌ గుండేటి నరేందర్‌ 20వ డివిజన్‌ నుంచి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి 34వ డివిజన్‌ నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్‌ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బంక సరళాయాదవ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న కేడల పద్మ, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ

ఒకరు కాకపోతే ఇంకొకరు...
నగరంలోని పలు డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరేసి కార్పొరేటర్‌ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మాజీ కార్పొరేటర్‌ కేడల పద్మ 42వ డివిజన్‌ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

టీఆర్‌ఎస్‌ నాయకుడు యోగానంద్‌ 41 డివిజన్‌ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్‌ నుంచి, బీజేపీ నాయకులు, సోదరులైన చాచర్ల చిన్నారావు 41 డివిజన్, దీనదయాళ్‌ 40వ డివిజన్‌ నుంచి, 40వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి, అదే డివిజన్‌ నుంచి ఆరేళ్లి రవితో పాటు ఆయన సతీమణి కూడా నామినేషన్లను దాఖలు చేశారు. స్రూ్కటినీలో ఏదైనా నామినేషన్‌ తిరస్కరణకు గురైనా మరొకరు పోటీలో ఉండొచ్చనే భావనతో ఇద్దరేసి నామినేషన్లు సమర్పించినట్లు తెలిపారు. 

నేడు నామినేషన్ల పరిశీలన

వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో భాగంగా అదివారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ము గిసింది. ఇక సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేష న్లు స్వీకరించిన వరంగల్‌లోని ఎల్‌బీ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీల్లో పరిశీలనకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమర్పించిన అభ్యర్థుల్లోఉత్కంఠ నెలకొంది. 

పరిశీలన విధివిధానాలు

  •  నామినేషన్ల పత్రాల పరిశీలనలో రిటర్నింగ్‌ అధి కారి(ఆర్‌ఓ)కి నిబంధనలకు లోబడి సర్వ అధికా రాలు ఉంటాయి. 
  • నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థితోపాటు ప్రతి పాదించి వ్యక్తి,ఏజెంట్,సమీప బంధువు హాజ రుకావొచ్చు. లేదంటే న్యాయ సలహాదారుడి పరి శీ నలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. 
  • అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌లోని ఫారం – 8లో పొందుపరిచిన వివరాలను పరిశీలించి అభ్య ర్థి, ప్రతిపాదిత వ్యక్తుల పేర్లు, వివరాలు, సంతకాలను సరిచూస్తారు.
  • అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, ఓటరు జాబి తాలో ఉన్నాయో, లేదో పరిశీలిస్తారు.
  • నామినేషన్‌ పత్రాల్లో జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీ చేసే వ్యక్తి బీ – ఫారం సమర్పించారా, లేదా అని చూస్తారు. (నావిునేషన్‌ ఉపసంహరణ గడువు వరకు బీ – ఫారం సమర్పించే వెసులుబాటు ఉంది.)
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థి చివరి వరకు కూడా బీ – ఫారం సమర్పించకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారనే వివరణ పత్రాన్ని పరిశీలిస్తారు. స్వతంత్య్ర అభ్యర్థిగానై బరిలో ఉంటారా, లేదా అని తెలుసుకుంటారు.
  • గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినప్పటికీ అధికారులు ఇచ్చిన గుర్తుల్లో తాను కోరుకునే గుర్తు ముందుగానే నమోదు చేసి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన డివిజన్లకు సంబంధించి అభ్యర్థి ఆన్‌లైన్‌ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు.
  • ఎన్నికల నియమావళి ఆధారంగా నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థి నిబంధనలకు లోబడి ఉంటానని, ప్రచారం ఖర్చుల వివరాలు తప్పక అందజేస్తానని జత చేసిన ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు.
  • ధృవీకరణ పత్రాల్లో అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు తప్పక నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా నమోదైన కేసులు ఉన్నాయో, లేదో కూడా వెల్లడించి ఉండాలి.
  • డిపాజిట్‌ జమ చేసిన బిల్లును కూడా పరిశీలించాక అన్నీ సక్రమంగా ఉంటే నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు.
  • ఏ అభ్యర్థి నామినేషన్‌ విషయంలోనైనా ప్రత్యర్థులు కానీ, ఇతర వ్యక్తులు కానీ గడువులోగా అభ్యంతరాలు, అభియోగాలు చేసే అవకాశం కల్పిస్తారు. అయితే, తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
  • అభియోగాలను పరిశీలించి నిజమేనని తేలితే నామినేషన్‌ను తిరస్కరించడంతో పాటు ఇరువర్గాల నుంచి సంతకాలు తీసుకుంటారు.
మరిన్ని వార్తలు