వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్లు మార్పు

12 Aug, 2021 16:32 IST|Sakshi

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది.

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. 13 మండలాలతో వరంగల్‌ జిల్లా, 14 మండలాలతో హన్మకొండ జిల్లా ఏర్పాటయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా పేరును వరంగల్‌ జిల్లాగా పేర్లు మారుస్తున్నట్లు జూన్‌ 21న వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలంటూ గత నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ గడువు ఈ నెల 10వ తేదీన ముగిసింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జిల్లాల పేర్ల మార్పును ప్రకటించింది.

 

మరిన్ని వార్తలు