హైదరాబాద్‌: వాటర్ పైప్ లైన్ పగిలి..

19 Dec, 2020 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి మెహదీపట్నం దగ్గర వాటర్‌ పైప్‌లైన్‌ లీకైంది. దీంతో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. పిల్లర్‌ నంబరు 53 దగ్గర పైప్‌ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాలన్ల కొద్దీ నీరు వృథాగా పోయింది. రేతిబౌలి- అత్తాపూర్‌ మార్గంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ(హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు) సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమతులు చేపట్టింది. కాగా పైప్‌లైన్‌ లీకేజీకి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మొన్నటి దాకా వరదలు.. ఇప్పుడు ఇక్కడ సునామీ కూడా వచ్చిందా ఏంటీ.. నీళ్లు వృథాగా పోనివ్వకండి. అధికారులు కాస్త శ్రద్ధ వహించండి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్‌)

మరిన్ని వార్తలు