తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు 

22 Jul, 2021 01:16 IST|Sakshi
బుధవారం కురిసిన భారీ వర్షంతో నీట మునిగిన ఆదిలాబాద్‌ జిల్లాలోని కండ్రవాగుపై వంతెన 

సాక్షి, హైదరాబాద్‌: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. నేటి నుంచి మూడ్రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.48 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 52శాతం అధికంగా వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు

మరిన్ని వార్తలు