Telangana: అక్కడక్కడా భారీ వర్షాలు

29 Jun, 2022 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రుతుపవ నాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు  సగటు సముద్ర మట్టానికి విస్త రించి ఉంది. దీంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 11 సెంటీమీటర్లు, అశ్వా పురంలో 10 సెంటీమీటర్లు, దుమ్ముగూడెంలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.  

మరిన్ని వార్తలు