బలహీనపడిన అల్పపీడనం

20 Jul, 2022 01:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్పపీడనం మంగళ­వారం బలహీన పడింది. ద్రోణి సగటు సముద్ర మట్టం మధ్య విస్తరించి ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలో కొ­న్ని చోట్ల తేలికపాటి  నుండి మోస్తరు వర్షా­లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతా­­వరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగూడెం, పాల్వంచలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జూలూరు­పాడులో 4, అశ్వారావుపేట, బూర్గంపాడు, ఇల్లందు, టేకులపల్లి, వెంకటాపురాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు