పెళ్లింట విషాదం: తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి

29 Apr, 2021 20:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కో కరోనా మరణం వెనుక తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఒక్కో కథ వింటే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడి కథ వింటే గుండెలు పిండేసేలా ఉంది. తమ్ముడి పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిన యువకుడు తెలంగాణలో కరోనా బారినపడ్డాడు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. దీనికి వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారం తండాకు చెందిన ప్రేమ్ లాల్ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య, పాపతో కలిసి అమెరికాలోనే నివసిస్తున్నాడు. అయితే మే 6వ తేదీన సోదరుడి వివాహం ఉండడంతో కొన్ని రోజులు ముందుగానే అమెరికా నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చాక ప్రేమ్‌లాల్‌ కరోనా బారిన పడ్డాడు. అతడి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. అనారోగ్యం చెందడంతో ప్రేమ్‌లాల్‌ మొదట స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీని సంప్రదించి మందులు వాడాడు. కొన్ని రోజులకు ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ప్రేమ్‌లాల్‌ మృతితో పెళ్లింట తీవ్ర విషాదం నిండింది.

చదవండి: 
ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

577 మంది టీచర్లు కరోనాకు బలి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు