హైదరాబాద్‌ విద్యార్థికి వెల్స్‌స్లీ వర్సిటీ రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్‌

20 Jul, 2022 08:02 IST|Sakshi

మల్కాజిగిరి: లక్ష్య సాధనకు సంకల్ప బలం దండిగా ఉండాలి. విజయం దిశగా పయనించేందుకు అకుంఠిత శ్రమ తోడవ్వాలి. ఆ కోవకు చెందిన యువతియే మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన లక్కప్రగడ నీలిమ కుమార్తె శ్రేయా సాయి. అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్‌లీ కాలేజీలో 2022– 26 వరకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోసం రూ.2.7 కోట్ల (ఇండియన్‌ కరెన్సీ) స్కాలర్‌షిప్‌ ప్యాకేజీని సదరు యూనివర్సిటీ నుంచి ఆమె పొందడం గమనార్హం. శ్రేయా సాయి సైనిక్‌పురిలోని భవన్స్‌లో పదో తరగతి, నల్లకుంటలోని డెల్టా కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివింది.

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వెల్స్‌స్లీ కాలేజీని ఎంపిక చేసుకొని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. శ్రేయా సాయి ప్రతిభను గుర్తించిన మసాచుసెట్స్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్, సైకాలజీలో యూజీ చేయడానికి రూ.2.7 కోట్లు మంజూరు చేస్తూ మార్చి నెలలో సంబంధించిన పత్రాలను అందజేశారు. కాలేజీ ఫౌండర్‌ శ్రీకాంత్‌ మల్లప్ప, అకాడమీ డైరెక్టర్‌ భాస్కర్‌ గరిమెళ్లతో పాటు పాటా్నకు చెందిన గ్లోబల్‌ సంస్థ సీఈఓ శరత్‌ సహకారంతో వెల్స్‌లీ కళాశాలలో సీటు సాధించినట్లు శ్రేయా సాయి తెలిపింది. వచ్చే నెలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్నట్లు పేర్కొంది.  

అమ్మ తోడ్పాటుతోనే.. s
పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొనే దాన్ని. స్వచ్ఛ భారత్‌ నిర్వహణకు తోటి విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేశాను. కేబినెట్‌ మెంబర్‌గా ఉండేదాన్ని. అమ్మ నీలిమతో పాటు అమ్మమ్మ జానకీదేవి సహకారం ఎంతో ఉంది. ప్రత్యేక కార్యాచరణతో ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్స్‌తో పాటు, సెమినార్స్‌లో పాల్గొనేదాన్ని. నా పట్టుదలే లక్ష్యాన్ని దరిజేరేలా చేసింది.  
 – శ్రేయాసాయి   

(చదవండి: బాత్రూంలోనే నివాసం)

>
మరిన్ని వార్తలు