అత్యాచార ఘటనతో హోంమంత్రి మనవడికి సంబంధం లేదు: వెస్ట్‌జోన్ డీసీపీ

3 Jun, 2022 22:54 IST|Sakshi

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు వున్నాడనేది పూర్తిగా అవాస్తవం అని వెస్ట్‌జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్ సృష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అతను ఎక్కడా కనిపించ లేదని, అన్నీ పరిశీలించాకే క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలిపారు.  బాలిక అత్యాచార ఘ‌ట‌న‌పై శుక్రవారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేర‌కు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు న‌మోదు చేశామ‌న్నారు. సెక్షన్‌ 354, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు.

బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు  నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఈ కేసులో ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. అయితే అతడు మైనర్‌ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచార‌ణ చేస్తున్నార‌ని, నాలుగు ప్ర‌త్యేక బృందాలను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా ల‌భించ‌లేద‌ని డీసీపీ పేర్కొన్నారు.
చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు

మరిన్ని వార్తలు