సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానం చేస్తుండగా.. 

22 Oct, 2022 08:51 IST|Sakshi

కుషాయిగూడ: సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానం చేస్తుండగా షాట్‌ సర్క్యూట్‌ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం చర్లపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్‌రెడ్డినగర్‌ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్లగా కొడుకు తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి స్నానానికి వెళ్లాడు.

చార్జింగ్‌ పెట్టిన చోట షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన అతడు బయటకు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకుంటున్నాయి.  అప్రమత్తమైన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆదకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్‌ తదితరులు ఉన్నారు.   

(చదవండి: ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్‌పై కేసు నమోదు)

మరిన్ని వార్తలు