మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త

16 Sep, 2023 13:57 IST|Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది.

కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్‌.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు