జల వివాదం: పర్మిషన్‌ లేకుంటే ప్రాజెక్టుల మూత!

17 Jul, 2021 02:53 IST|Sakshi

కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలలే గడువు ఇస్తున్నట్టు గెజిట్‌లో కేంద్రం వెల్లడి

పనులు పూర్తయినా నీళ్లు తీసుకునే వీల్లేదని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది.

గెజిట్‌లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే

కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు 

  • శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్బీసీ) 
  • ఎస్‌ఎల్బీసీ సామర్థ్యం 
  • మరో పది టీఎంసీలు పెంపు 
  • కల్వకుర్తి ఎత్తిపోతల
  • కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు 
  • పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ 
  • డిండి ఎత్తిపోతల 
  • ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు 
  • భక్త రామదాస ఎత్తిపోతల 
  • తుమ్మిళ్ల ఎత్తిపోతల 
  • నెట్టెంపాడు ఎత్తిపోతల 
  • నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు 
  • దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు 

(వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో కేంద్రం అధికారికంగా గుర్తించింది)

కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు

  • తెలుగు గంగ 
  • వెలిగొండ 
  • హంద్రీ-నీవా 
  • గాలేరు-నగరి 
  • ముచ్చుమర్రి ఎత్తిపోతల 
  • సిద్ధాపురం ఎత్తిపోతల 
  • గురు రాఘవేంద్ర 

(ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో కేంద్రం అధికారికంగా గుర్తించింది)

ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు 
మున్నేరు పునర్‌ నిర్మాణం

గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు

  • కంతనపల్లి బ్యారేజీ 
  • కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు 
  • రామప్ప- పాకాల మళ్లింపు 
  • తుపాకులగూడెం బ్యారేజీ 
  • మోదికుంటవాగు ప్రాజెక్టు 
  • చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల 
  • కందుకుర్తి ఎత్తిపోతల 
  • బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత 
  • గూడెం ఎత్తిపోతల 
  • ముక్తేశ్వర్‌ ఎత్తిపోతల 
  • సీతారామ ఎత్తిపోతల 
  • (రాజీవ్‌ దుమ్ముగూడెం)
  • పట్టిసీమ ఎత్తిపోతల 
  • పురుషోత్తపట్నం ఎత్తిపోతల 
  •  చింతలపూడి ఎత్తిపోతల 
  • వెంకటనగరం ఎత్తిపోతల
మరిన్ని వార్తలు