ట్రింగ్‌.. ట్రింగ్‌..హే హలో నేను..అబ్బాయిలా గొంతు మార్చి..20 లక్షలు కాజేసిన

7 Dec, 2021 01:29 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

ఫేస్‌బుక్‌ ఫేక్‌ ఐడీలతో  రూ.20 లక్షలు వసూలు చేసిన యువతి 

బాధితుల్లో మీడియా ప్రతినిధులు,పోలీసులు కూడా..

కిలాడీ మహిళను అరెస్టు చేసిన పోలీసులు  

ఫేస్‌బుక్‌లో తప్పుడు పేర్లు, ఫొటోలతో ఐడీలు క్రియేట్‌ చేసింది. అమ్మాయిలను ట్రాప్‌ చేసేందుకు అబ్బాయిల పేర్లు, ఫొటోలు.. అబ్బాయిలను ముగ్గులో దించేందుకు అమ్మాయిల ఫొటోలు, పేర్లు వాడింది. గొంతుమార్చి తనే అబ్బాయి, అమ్మాయిగా మాట్లాడింది. ఫేక్‌ ఫ్యామిలీ ఫొటోలు క్రియేట్‌ చేసి లోతుగా ప్రేమలోకి దించింది. తాను దూరమైతే వారు చచ్చిపోయేలా చేసి.. చివరకు బ్లాక్‌మెయిల్‌చేసి రూ. 20 లక్షలకుపైగా వసూలు చేసింది. వింటేనే అశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతా చేసి ఆ మహిళ చదివింది కేవలం ఇంటర్‌. 
 
కరీంనగర్‌ క్రైం:
లేని పేర్లు, మనుషులను సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో పలువురు యువతీ, యువకులను మోసగించి రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ మహిళ (30)ను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్‌ కేంద్రం లో అడిషనల్‌ డీసీపీ (లాఅండ్‌ఆర్డర్‌) ఎస్‌.శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందిన మహిళ కరీంనగర్‌ లోని తిరుమలనగర్‌లో ఉంటూ మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. ఒక వ్యక్తితో పెళ్లి, విడాకులయ్యాయి. రెండో పెళ్ళి చేసుకున్నా ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. 

 వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌
   (వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌)   

2012 నుంచి మోసాలు.. 
తనకు తెలిసిన అబ్బాయిని వలలో వేసుకునేందుకు 2012లో ఒక ఫేస్‌బుక్‌ ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసింది. తర్వాత అతడికి తెలిసిన ఒక ఉన్నత ఉద్యోగం గల యువతిని పరిచయం చేసుకొని యువకుడి పేరుతో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి చాట్‌ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఆమెను లోతుగా ప్రేమలోకి దింపింది. విచిత్రమేమిటంటే మహిళ అయి ఉండి కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా మిమిక్రీ చేస్తూ మగవాడిలా మాట్లాడుతూ జాగ్రత్తపడింది. బాధల్లో ఉన్నానంటూ బాధితురాలి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. 34 ఫేక్‌ఐడీలు క్రియేట్‌ చేసి 10 సిమ్‌కార్డులను ఉపయోగించి 20 మందికి పైగా యువతీ యువకులను మోసం చేసింది. రూ.20 లక్షలకుపైగా వసూలు చేసింది.

మరిన్ని వార్తలు