ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం

19 May, 2021 10:42 IST|Sakshi

ఆత్మకూర్‌/నేలకొండపల్లి: కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా.. నెలరోజులైనా కాంటా వేయలేదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం జూరాలకు చెందిన పద్మ (36)  మూడెకరాల పొలంలో వరి సాగుచేశారు. వారం రోజులు ధాన్యం ఆరబెట్టి గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం తూకం వేయించారు.

కొనుగోలు చేసి న ధాన్యం తరలించే వరకు రైతులదే బాధ్య త అని చెప్పడంతో రేయింబవళ్లు ధాన్యం బస్తాల వద్దే ఆమె కాపలా కాసింది. ఈనెల 16, 17 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇంకెన్ని రోజులు ఇలా కాపలా కాయా లంటూ ఐకేపీ నిర్వాహ కులతో సోమవారం సాయంత్రం వాగ్వాదానికి దిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందింది.  

నెలరోజులైనా కాంటా వేయలేదని..  
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు గడ్డం లింగయ్య నెల రోజుల క్రితం మార్కెట్‌ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చా డు. ధాన్యాన్ని ఆరబెట్టి ప్రతిరోజు కాపలా కాస్తూ తనకిచ్చిన సీరియల్‌ నంబరు ప్రకా రం కాంటా వేయించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. అయితే తనకంటే వెనుక తీసుకొచ్చిన దళారుల ధాన్యాన్ని మాత్రం కాంటా వేస్తున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని లింగయ్య తీవ్ర మనస్తాపంతో మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తోటి రైతులు అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలా రోజుల తరబడి తిప్పించుకోవడం ఏమిటని ఆగ్రహించిన రైతులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఇకపై వేగంగా కాంటాల ప్రక్రియ పూర్తి చేయిస్తామని తహసీల్దార్‌ హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు.
చదవండి: స్ఫూర్తిమంతంగా  నిలిచిన మహిళా సర్పంచ్‌

మరిన్ని వార్తలు