నేను బతికే ఉన్నా! నా పింఛన్‌ నాకు ఇప్పియిండ్రి... 

11 Nov, 2021 12:59 IST|Sakshi

సాక్షి,పెద్దపల్లి(కరీంనగర్‌): నేను బతికే ఉన్నా నాకు ఇదివరకు ఇచ్చినట్టే వితంతు పింఛన్‌ ఇప్పియిండ్రి.. అంటూ పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన దాడిలక్ష్మి వితంతు మహిళ అధికారులను వేడుకుంటోంది. రూ.వెయ్యి పింఛన్‌ ప్రతినెలా ఇచ్చిన అధికారులు పింఛన్‌ మొత్తం రూ. 2016కు పెంచినప్పట్నుంచి ఆపేశారని వాపోయింది. చనిపోయినట్లుగా రికార్డుల్లో తప్పుగా నమోదుచేశారని తెలిపింది.

ఈ క్రమంలో.. పింఛన్‌ నిలిచిపోయిందని యథావిధిగా తనకు పింఛన్‌ అందేలా అధికారులు చొరవతీసుకోవాలని వేడుకుంటోంది. ఆఫీసు ల చుట్టూ, కార్యదర్శి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానని, అయినా అధికారులు జాలిచూపడం లేదని దాడిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు