గిరిజన రైతులు – అటవీ అధికారుల ఘర్షణ   

10 Feb, 2021 09:40 IST|Sakshi
బావిలో దూకిన మహిళను బయటకు తీసుకొస్తున్న స్థానికులు

గూడూరు: పోడు భూముల్లో సర్వే కోసం వెళ్లిన అటవీ అధికారులు, గిరిజన రైతుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్‌ జిల్లా లైన్‌తండాలో మంగళవారం ఈ ఘటన జరి గింది. 1032 కంపార్ట్‌మెంట్‌ ఫారెస్టు పరిధిలో తండావాసులు యాభై ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరిలో కొందరికి పాస్‌పుస్తకాలు ఉన్నాయి. వారం క్రితం అధికారులు గిరిజనులు సాగు చేసుకునే పంట భూములను స్వాధీనం చేసుకునేందుకు ట్రెంచ్‌ పనులు చేపట్టాలని సర్వే మొద లుపెట్టారు. ఇది తెలుసుకున్న గిరిజనులు.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో మాట్లాడిస్తామని చెప్పడంతో వారు వెనుతిరిగారు.

తర్వాత తమకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పత్రాలు ఉన్నందున సాగు భూములను పరిశీలించాలని కోరగా.. అధికారులు మంగళవారం అక్కడికి వచ్చారు. రైతులు, మహిళలు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తండాకు చెందిన బానోతు పార్వతి తమ భూమి పోతుందేమోనన్న ఆవేదనతో పురుగుల మందు తాగుతూ వ్యవసాయ బావిలో దూకింది. తండావాసులు ఆమెను పైకితీసి ఆస్పత్రికి తరలించారు. కొందరు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు.

చదవండికరోనా టీకా వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

మరిన్ని వార్తలు