బామ్మకు బజారే దిక్కయింది..

9 May, 2021 15:46 IST|Sakshi
బజారులో టెంట్‌ కింద తల్లితో వెంకటస్వామి

వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు.

దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్‌లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు