సీఎం కేసీఆర్‌  కాన్వాయ్‌లో షాకింగ్‌ ఘటన..

1 Oct, 2022 11:58 IST|Sakshi

సాక్షి, జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్‌ నుంచి మహిళా పోలీస్‌ అధికారి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం.. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. కాన్వాయ్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ జారీ జాతీయ రహదారిపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపి వేశారు.


చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్‌ గుర్తు చేసింది: కేటీఆర్‌ 

మరిన్ని వార్తలు