భర్త వివాహేతర సంబంధం.. ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను.. నువ్వు అవసరం లేదు’

21 Mar, 2023 11:31 IST|Sakshi
నిరసన తెలుపుతున్న భార్య

సాక్షి, వికారాబాద్‌: న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తొండుపల్లికి చెందిన కుర్వ శ్రీశైలం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మిట్టకోడూరు గ్రామానికి చెందిన అనితతో నవంబర్‌ 2021న వివాహం జరిగింది.

శ్రీశైలం విధులు నిర్వహించే కార్యాలయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను పట్టించుకోవడంలేదని భార్య అనిత ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా తీరులో మార్పురావడం లేదని అన్నారు. సోమవారం కూడా మరోసారి పంచాయితీ పెట్టి మాట్లాడగా ‘లేడి కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాను. . నువ్వు అవసరం లేదు’అని చెప్పడంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు అనిత తెలిపారు.

తనకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేదిలేని భీష్మించి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అని, ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.
చదవండి: నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన వైద్య సేవలు

మరిన్ని వార్తలు