కామారెడ్డి: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

22 Mar, 2021 10:34 IST|Sakshi

 అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపణ

న్యాయం చేయాలని వేడుకోలు

సాక్షి, మాచారెడ్డి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతు భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని బండరామేశ్వర్‌పల్లిలో జరిగింది. కోడలి రాకను గమనించిన అత్త లక్ష్మీ, మామ నారాయణ ఇంటికి తాళం వేసి పరారైనట్లు ఆమె తెలిపింది.

వివరాలు ఇలా ఉన్నాయి. బండ రామేశ్వర్‌పల్లికి చెందిన ఉట్ల శ్రీనివాస్‌కు కామారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి శరణ్యను రెండేళ్ల కింద ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా కట్న కానుకలతో పాటు నగదు, బంగారాన్ని అందజేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గాయత్రి శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవాలని తనపై ఎన్నో నిందలు వేస్తున్నారని ఆరోపించింది. తనను వేధిస్తున్న భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు