మానవత్వం చాటిన మగువ.. 

17 Apr, 2021 05:19 IST|Sakshi

కరోనా మహామ్మారి రోజురోజుకూ ఉధృతమవుతున్న తరుణంలో అందరికీ మాస్క్‌ అందించేందుకు కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదురుగా ఇండియన్‌ యూత్‌ సెక్యూర్డ్‌ సంస్థ ఈ మాస్క్‌ వాల్‌ ఏర్పాటు చేసింది. మాస్కులు కావాల్సినవారు వాటిని తీసుకోవచ్చు. ఈ క్రమంలో 2 చేతులు కోల్పోయి భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడు అక్కడకు వచ్చాడు. అతడికి మాస్కు లేదు.. పెట్టుకుందామంటే చేతులు లేవు. ఏం చేయాలా అని అలా నిలబడి చూస్తున్న సమయంలో ముగ్గు రు యువతులు బస్టాండులోకి వెళ్తూ అతడిని చూశారు. వారిలో ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గర కు వెళ్లి మాస్క్‌ వాల్‌ నుంచి ఒక మాస్కు తీసి అతడికి తొడిగి మానవత్వాన్ని చాటుకుంది. 
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, కరీంనగర్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు