ఆకలేస్తోంది.. లే అమ్మా

8 Sep, 2021 03:00 IST|Sakshi
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తల్లి మృతదేహం పక్కనే కూర్చుని రోదిస్తున్న కుమారుడు కృష్ణ   

చనిపోయిన తల్లి పక్కన రాత్రంతా నిద్రించిన కుమారుడు 

అశ్వారావుపేట రూరల్‌: తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఓ తల్లి నిద్రలోనే మృతిచెందింది. ఇది తెలి యని ఆమె ఏడేళ్ల కుమారుడు అమ్మ ఒడిలోనే రా త్రంతా నిద్రించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. సంతల్లో ప్లాస్టిక్‌ సామాన్లు, బుడగలు అమ్ముకునేందుకు వచ్చిన నిర్మల (45) తన ఏడేళ్ల కుమారుడు కృష్ణతో కలిసి స్థానికంగా పాకలో నివాసముంటోంది. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధ పడు తోంది.

సోమవారం రాత్రి జ్వరం ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ విషయం  తెలియని కొడుకు కృష్ణ రాత్రంతా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. తెల్లవారాక ఆకలి వేస్తోందంటూ తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ ఆమె లేవకపోవడంతో చుట్టుపక్కల వారికి చెప్పగా, వారు వచ్చి చూసేసరికే నిర్మల మృతి చెంది కనిపించింది. తన తల్లి జ్వరంతో నిద్రపోతోందని అమాయకంగా కృష్ణ చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి.

సమాచారం అందుకున్న ఎస్సై చల్లా అరుణ నిర్మల మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు వరంగల్‌లో ఉన్నట్లు బాలుడి ద్వారా తెలియడంతో, వారు వచ్చాక మృతదేహాన్ని వారికి అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు