ఒకరితో ప్రేమ, మరోకరితో పెళ్లి నిశ్చయం..అడిగితే రెండు రోజుల్లో వస్తానని చెప్పి

7 May, 2022 21:00 IST|Sakshi
 బైఠాయించిన యువతి 

సాక్షి, ఆసిఫాబాద్‌ అర్బన్‌: ప్రియుడు మోసగించాడని ఓ యువతి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ప్రియుని ఇంటి ఎదుట భైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి, పట్టణంలోని జన్కాపూర్‌ కు చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు.

దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చినట్లు పేర్కొంది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు