చాయ్‌వాలా ఫీట్లు : పోలీసు ఉన్నతాధికారి ఫిదా

13 Jan, 2021 13:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా  ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే  యాక్టివ్ గా ఉంటారు.  తమ శాఖ అందిస్తున్న​ సేవలపై  నిరంతరం ట్విటర్‌లో అప్‌డేట్‌ చేస్తూ, అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే  ఆమె తాజాగా  ఒక ఫన్నీ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడం  విశేషం. ఛాయ్ వాలా  నైపుణ్యాన్ని చూసి ముచ్చటపడుతూ నవ్వుకుంటున్న సుమతి  వీడియో ప్రస్తుతం  పలువురిని ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే డీఐజీ సుమతి కూడా ఒక షాపులో ఇరానీ టీ తాగేందుకు ఆగారు. ఆమె టీ కప్ తీసుకోవటానికి యత్నిస్తున్నపుడే  అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ చాయ్ వాలా ఆ కప్పును ఆమెకు దొరక్కుండా  చేస్తూ..ఫన్నీ ఫీట్లతో అలరించారు.  సాక్షాత్తూ పోలీసు ఉన్నతాధికారినే ఫిదా చేసిన ఈ ఫీట్లు చూస్తే  మీరు కూడా వావ్ అంటారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు