ప్రత్యేక టీం: మహిళలను వేధిస్తే ఇక తాట తీసుడే..

16 Jun, 2021 02:56 IST|Sakshi

హలో.. విమెన్‌ విక్టిమ్స్‌ కాల్‌సెంటర్‌!

గృహహింస బాధితుల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌

జూలైలో 200 మంది సిబ్బందితో ఏర్పాటు

హైదరాబాద్‌: మహిళలపై వేధింపులు, ఎన్నారైల సమస్యలపై కృషి చేస్తున్న విమెన్‌ సేఫ్టీ వింగ్‌ మరో ముందడుగు వేసింది. గృహహింస, వరకట్న వేధింపుల్లో చిక్కుకున్న మహిళల కోసం విమెన్‌ విక్టిమ్స్‌ కాల్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనుంది. లక్డీకాపూల్‌లోని విమెన్‌ సేఫ్టీ వింగ్‌లో డొమెస్టిక్‌ వయొలెన్స్‌(డీవీసీ) కాల్‌ సెంటర్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో డీఐజీ సుమతి కాల్‌సెంటర్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 200 మంది సిబ్బందితో జూలై మొదటి వారంలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడుభాషల్లో టెలీకాలర్స్‌: లాక్‌డౌన్‌ కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఏప్రిల్, మే నెలలో 14 వేలకుపైగా గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెల 1,800–2,000 కేసులు రిజిస్టర్‌ అవుతున్నాయి. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి విమెన్‌ విక్టిమ్‌ కాల్‌ సెంటర్‌ నుంచి కాల్‌ చేస్తారు. కేసు పురోగతి ఎలా ఉంది? దర్యాప్తు అధికారి (ఐవో) ఎలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలు కాల్‌ చేసి తెలుసుకుంటారు. తెలంగాణలో అనేక భాషల వారు నివసిస్తున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో టెలీకాలర్స్‌ను నియమించనున్నారు. ఐవో, బాధితులతో మాట్లాడి, డైలీ సిచ్యుయేషన్‌ రిపోర్ట్‌ (డీఎస్‌ఆర్‌)ను ఏరోజుకారోజు నమోదు చేస్తారు. ఎఫ్‌ఐఆర్, కౌన్సెలింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తిస్తారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు