ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర 

2 Mar, 2022 02:02 IST|Sakshi
అఖండజ్యోతిని వెలిగిస్తున్న వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, ఆచార్యులు 

ఈనెల 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట: ఈ నెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో సిద్ధమైన స్వామి వారి అఖండజ్యోతి యాత్ర యాదగిరిభవన్‌ నుంచి మంగళవారం ప్రారంభమైంది. అఖండజ్యోతి యాత్రను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అఖండజ్యోతియాత్ర చైర్మన్‌ ఎంఎస్‌ నాగరాజు, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు ప్రారంభించారు.

యాత్ర మొదటిరోజు ఉప్పల్‌ చౌరస్తాకు చేరుకుంది. బుధవారం ఉప్పల్‌ నుంచి బయల్దేరి శుక్రవారం ఉదయానికి భువనగిరికి, అక్కడి నుంచి రాత్రి యాదగిరిగుట్టకు చేరనుంది. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు అఖండజ్యోతిని అప్పగిస్తామని అఖండజ్యోతి చైర్మన్‌ నాగరాజు వెల్లడించారు. మరోవైపు ఈనెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు