ప్రారంభోత్సవానికి సిద్ధం!

9 Sep, 2021 04:56 IST|Sakshi
విద్యుత్‌ దీపాల కాంతుల్లో ప్రధానాలయం 

‘యాదాద్రి’లో శాస్త్రోక్త పూజల అనుమతి కోసం చినజీయర్‌ స్వామిని కలిసిన అధికారులు

2 రోజుల తరువాత రావాలని సూచించిన జీయర్‌స్వామి

సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో జరిగే ఉద్ఘాటనకు రావాలని సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్రమోదీని కలిసి కోరిన నేపథ్యంలో పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 20 తేదీ వరకు తుది దశ పనుల పర్యవేక్షణకు యాదాద్రికి మరోసారి రానున్నారు. మహా సుదర్శనయాగం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆలయ ప్రారంభోత్సవానికి ముందు శాస్త్రోక్త కార్యక్రమాలకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. నూతన ఆలయంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం భక్తులకు కల్పించే ముందు శాస్త్రోక్తంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల దిశానిర్దేశం కోసం దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఉప ప్రధానాచార్యులు త్రిదండి చినజీయర్‌స్వామిని కలిశారు. ఆయన పనుల ఒత్తిడిలో ఉండటంతో రెండు రోజుల తర్వాత మరోసారి రావాలని కోరారు. దీంతో మరోసారి జీయర్‌ స్వామిని కలిసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.  

మరిన్ని వార్తలు