దర్శనానికి మూడు గంటల సమయం 

23 May, 2022 01:44 IST|Sakshi
స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 

యాదాద్రిలో భక్తుల రద్దీ

30 వేల మంది రాక

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

సుమారు 30 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు