మార్చి 2024లోగా యాదాద్రి ప్లాంట్‌ పూర్తి చేయాలి 

8 May, 2022 00:38 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని 2024 మార్చినాటికి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులను కోరారు. బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులతో శనివారం ఆయన ఇక్క డ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను కొనాల్సి వస్తోందన్నారు. కాబట్టి యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు.  

మరిన్ని వార్తలు