యాదాద్రిలో రథశాల చూశారా?

24 Jul, 2021 15:24 IST|Sakshi

ఆధ్యాత్మిక హంగులతో నిర్మాణం

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని భద్రపరిచేందుకు కొండపై చేపట్టిన రథశాల నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయానికి పడమర, ఉత్తర రాజగోపురాల మధ్యలో వాయవ్య దిశలో రథశాలను ఆధ్యాత్మిక హంగులతో భక్తులకు కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. రథశాలకు దక్షిణం, ఉత్తర దిశల్లో గోపురం మాదిరిగా, కింది భాగంలో చక్రాలను నిర్మించారు.

పై భాగంలో పసిడి వర్ణం కలిగిన ఏడు కలశాలతో పాటు మూడు వైపులా స్వామివారి రూపాలతో కూడిన విగ్రహాలను అమర్చారు. వెనుక భాగం పడమటి దిశలో శంకు, చక్ర, తిరునామాలు వీటికి ఇరువైపులా గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్లు.. తీర్చిదిద్దారు. లోపలిభాగంలో చిన్నచిన్న పనులు మినహా మొత్తం నిర్మాణం పూర్తయింది. 

మరిన్ని వార్తలు