లడ్డూ విక్రయాల్లో అవినీతి.. యాదాద్రిలో భక్తుల ఆరోపణ

18 Apr, 2022 05:08 IST|Sakshi

సాక్షి,యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టికెట్‌ లేకుండానే లడ్డూ ప్రసాద విక్రయాలు జరుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా ప్రసాదం కౌంటర్ల సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దైవదర్శనం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఇష్టపడేది లడ్డూ, పులిహోర ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రధానాలయం ప్రారంభమయ్యాక భక్తులు అధికంగా తీసుకెళ్తున్నారు.

ప్రసాదం కొనుగోలుకు భక్తులు ఒక కౌంటర్‌లో డబ్బులు చెల్లించగానే టికెట్‌ ఇవ్వాల్సి ఉం టుంది. ఆ టికెట్‌ తీసుకుని మరో కౌంటర్‌ వద్దకు వెళ్లి ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం ఎన్ని ప్రసాదాలు తీసుకుంటే అన్ని టికెట్లివ్వాల్సి ఉంటుంది. కానీ కౌంటర్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి టికెట్లు ఇవ్వకుండా లడ్డూ ప్రసాద విక్రయాలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు