యాదాద్రిలో రూ.150 టికెట్‌కు ప్రత్యేక క్యూలైన్లు

21 Jun, 2022 15:12 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్‌ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే  భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది.

ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. (క్లిక్: నరసింహుడికి బంగారు సింహాసనం)

మరిన్ని వార్తలు