Yadagirigutta: యాదాద్రి ఆలయంలో భక్తుల కోలాహలం

19 Sep, 2022 15:12 IST|Sakshi
ఆలయ తిరువీధిలో కిక్కిరిసిన భక్తులు

స్వామివారిని దర్శించుకున్న 25,219 మంది భక్తులు

దర్శనానికి రెండున్నర గంటల సమయం

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలతో పాటు కొండపై ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో భక్తులు కిటకిటలాడారు.


స్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కొండ కింద రింగ్‌ రోడ్డులో బస్సుల కోసం భక్తులు వేచి చూడాల్సి వచ్చింది. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో పాటు నిండుగా రావడంతో పుష్కరిణి నుంచి కొండ పైకి వెళ్లాల్సిన భక్తులు ఇబ్బందులు పడ్డారు.


మి వారిని 25,219 మంది భక్తులు దర్శించుకోగా, వివిధ పూజలతో రూ.39,44,918 నిత్య ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్‌తో రూ.2,78,250, వీఐపీ దర్శనాలతో రూ.4,65,000, ప్రసాద విక్రయంతో రూ.18,04,830, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,00,000, సువర్ణ పుష్పర్చనతో రూ.1,91,748, ఇతర పూజలతో రూ.2,87,340 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..)


వాహనాద్రి!

యాదాద్రి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమ వాహనాలను యాదాద్రి కొండకు దిగువన పార్కింగ్‌ చేశారు. పార్కింగ్‌ స్థలం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వీటిని చూస్తే.. ఏదైనా భారీ సభకు వచ్చిన వారి వాహనాల్లా అనిపించింది.         
– సాక్షి ఫొటోగ్రా ఫర్‌ యాదాద్రి భువనగిరి
 

మరిన్ని వార్తలు