కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి 

26 Nov, 2021 02:48 IST|Sakshi

సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య (50) ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాజయ్య ధాన్యం నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు గడుస్తోంది. వర్షాలు పడటంతో ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. రెండు రోజుల నుంచి ఛాతీలో నొప్పి వస్తోందని కుటుంబీకులతో చెబుతున్నాడు.

గురువారం సాయంత్రం కూడా ధాన్యం ఆరబెడుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని తోటి రైతులకు చెప్పడంతో వారు రాజ య్య భార్య రాజవ్వకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఆమె స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజయ్య మృతి చెందాడు.  

మరిన్ని వార్తలు