బంజారాహిల్స్‌లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్‌పై ఎక్కించి..

1 Apr, 2021 08:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని ఆల్మండ్‌ హౌస్‌ వెనుకాల నిర్మానుష్య చీకటి ప్రదేశంలో మద్యంమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైక్‌లపై వచ్చి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతి కూడా మద్యం మత్తులో ఉండగా ఆమెను తమ బైక్‌పై ఎక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కిందపడుకుంది. అయితే అప్పటికే బైక్‌ స్టార్‌ చేసి ఓ యువకుడు సిద్ధంగా ఉండటంతో యువతి ‘హెల్ప్‌హెల్ప్‌’ అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకునే లోపే ఆమెను ఓ యువకుడు బలవంతంగా బైక్‌పై కూర్చుండబెట్టుకొని ఉడాయించాడు.

స్థానిక మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే యువకులంతా బైక్‌లపై పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా స్పష్టమైన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే బలవంతంగా యువతిని బైక్‌పై ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రంతా మూడు పోలీసు బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాయి. నిర్మానుష్య ప్రాంతామే కాకుండా చీకటి ఉండటంతో ఇక్కడ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో సరిగ్గా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్‌కు గురైన యువతి ఎవరన్న దానిపై స్పష్ట రావడం లేదు. 

యువతి అదృశ్యం 
పంజగుట్ట: యువతి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో నివసించే గౌతం దుర్గేశ్వరి(18) పంజగుట్టలోని ఓ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంది. మంగళవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన దుర్గేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. షాపులో సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 7:10కి షాపు నుంచి వెల్లిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టుప్రక్కల సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616365 నెంబర్‌లో సంప్రదించాలని ఎస్సై సతీష్‌ తెలిపారు.  

చదవండి: విషాదం.. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. 
ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!

>
మరిన్ని వార్తలు