కొడుకు చితికి నిప్పుపెట్టిన తల్లి

9 Feb, 2023 11:36 IST|Sakshi

కరీంనగర్: తన కన్నీళ్లు తుడుస్తాడనుకున్న కుమారుడు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆతల్లి రోదనలు మిన్నంటాయి. మండలంలోని నీల్వాయికి చెందిన పున్యపురెడ్డి మధుకర్‌–రాజేశ్వరి దంపతులకు కుమారుడు సాయికుమార్, కూతురు పల్లవి సంతానం. సాయికుమార్‌ పదో తరగతి, ఇంటర్‌లో ఉన్నత శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి మధుకర్‌ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి రాజేశ్వరి అన్నీతానై పిల్లలిద్దర్నీ చదివించింది. 

కుమారుడు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసి మూడునెలల క్రితం బాచ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరాడు. మంగళవారం బ్రెయిన్‌ స్టోక్‌ రావడంతో బెంగళూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో మృతదేహాన్ని నీల్వాయికి తరలించారు. పుట్టెడు దుఃఖంలో తల్లి రాజేశ్వరి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసింది.

మరిన్ని వార్తలు