పొచ్చర జలపాతం వద్ద యువకుడి గల్లంతు

19 Jul, 2021 02:21 IST|Sakshi
కొట్టుకుపోతున్న గోనె హరీశ్‌.

బోథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద జైనథ్‌ మండలం కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై అరుణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్, నరేశ్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠికి చెందిన రమేశ్, భీంసరి గ్రామానికి చెందిన ఆడెపు వెంకట్‌ ఆదివారం మధ్యా హ్నం పొచ్చర జలపాతానికి వచ్చారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో జలపాతానికి వరద నీరు పోటెత్తింది.

వీరు తిరిగి వెళ్తున్న దారిలోఉన్న వంతె నపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.  వంతెన దాటే ప్రయత్నంలో రమేశ్‌ జారి పడడంతో హరీశ్‌ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వర ద ఉ«ధృతికి హరీశ్‌ కొట్టుకుపోయాడు. రమేశ్‌ వంతెనను పట్టుకుని బయటపడ్డాడు. హరీశ్‌(25)కు 6 నెలల క్రితమే వివాహం అయింది. ఆయన తండ్రి విఠల్‌ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు