­యువతి అదృశ్యం

18 Mar, 2023 11:56 IST|Sakshi

మెదక్‌: యువతి అదృశమైన సంఘటన మండల పరిధి చెండిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నర్మద గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం యువతి తండ్రి భూపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 

మరిన్ని వార్తలు