నడిరోడ్డుపై ఆకతాయికి చెప్పుదెబ్బలు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కు..

22 Nov, 2022 13:42 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ప్రేమపేరుతో వెంటపడి వేధించిన యువకుడిని నడిరోడ్డుపై ఓ యువతి చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డిలో జరిగింది. గత నెల రోజులుగా యువతిని శంకర్‌ అనే ఆకతాయి యువకుడు ఫాలో అవుతూ వేధించాడు.

ఈ క్రమంలోనే మంగళవారం ప్రేమిస్తున్నానంటూ యువతిని ఫోన్‌ నంబర్‌ అడటంతో యువతి ఆగ్రహంతో అపరకాళి అవతారమెత్తింది. జనం సమక్షంలోనే చెప్పుతోకొట్టి, దేహ శుద్ధి చేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది.

చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి)

మరిన్ని వార్తలు