మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. ఉండడానికి చోటు లేక బిక్కుబిక్కుమంటూ..

25 Jul, 2022 20:57 IST|Sakshi
సోని నివసిస్తున్న మరుగుదొడ్డి   

మాచారెడ్డి(కామారెడ్డి జిల్లా): ఊహ తెలియని వయసులో ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి కన్న తల్లే అన్నీ తానై పోషిస్తున్న సమయంలో మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురై  కన్నుమూసింది. మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లవ్వల ఏకైక కుమార్తె సోనికి కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మృతి చెందిన కొన్ని రోజులకే వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోయింది.
చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ 

ఉండడానికి చోటు లేక ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డిలోనే సోని ప్రస్తుతం నివసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుగుగా ఉన్న ఆ చిన్న మరుగుదొడద్డిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది.  గ్రామస్థుల సహకారంతో సోనికి వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించినా కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. 

మరిన్ని వార్తలు