హిమాయత్‌ సాగర్‌: ప్రమాదకర విన్యాసాలతో యువకులు

14 Jul, 2022 09:56 IST|Sakshi
హిమాయత్‌సాగర్‌ చెరువు ప్రాంతంలో ప్రమాదకర విన్యాసాలతో యువకులు 

సాక్షి, బండ్లగూడ: జలమండలి అధికారుల పర్యావేక్షణ లోపంతో హిమాయత్‌సాగర్‌ చెరువులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్‌ సాగర్‌ చెరువు నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. సందర్శకులకు డ్యామ్‌ పైకి అనుమతి లేని విషయం తెలిసిందే. కానీ కొంతమంది యువకులు చెరువు ఒడ్డుకు వెళ్లి ప్రమాదకరంగా సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు