సాక్షి ఎడిటర్‌కు ‘కాంబోడియా’ బాధితుల కృతజ్ఞతలు

21 Oct, 2022 15:41 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తాము స్వదేశానికి రావడంలో ‘సాక్షి’చూపిన చొరవ మరువలేని దని ‘కాంబోడియా’బాధితులు అన్నారు. గురువారం కరీంనగర్‌కు చెందిన యువకులు సలీం, షారుఖ్, షాభాజ్, హాజీ హైదరాబాద్‌ లోని ‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో ఎడిటర్‌ వర్ధెల్లి మురళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి అక్కడ సైబర్‌ నేరస్తుల ముఠా చేతిలో చిక్కిన తాము తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. అయితే సాక్షి దినపత్రిక వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేలా చేసిందని అన్నారు. 

ఈ సందర్భంగా కాంబోడియాలో సైబర్‌ నేరస్తుల ముఠా తమను ఎలా హింసించిందన్న విషయాలను వారు ఎడిటర్‌కు వివరించారు. సెప్టెంబర్‌ 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన కరీంనగర్‌ యువకులు కాంబోడియాలో చిక్కుకున్న విషయాన్ని ‘సాక్షి‘బయట పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత కూడా సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన కరీంనగర్‌ పోలీసులు, స్థానిక ఎంపీ సంజయ్‌ చొరవ తీసుకుని ఆ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. (క్లిక్‌: ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం)

మరిన్ని వార్తలు