గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్‌ నుంచి యాత్ర

2 Sep, 2021 07:31 IST|Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడంతోకశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర

గతంలో లాక్‌డౌన్‌తో నిలిపివేత

నేడు ఆదిలాబాద్‌ నుంచి మళ్లీ మొదలు

ఆదిలాబాద్‌ టౌన్‌: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్‌ జగనన్నకు గుండె నిండా అభిమానాన్ని చాటారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ సీఎం కావాలని 2018లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి అయితే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్ర చేపడతానని ప్రతిజ్ఞ చేశాడు. జగన్‌ సీఎం కావడంతో ఇచ్చిన మాట ప్రకారం సైకిల్‌ యాత్ర చేపట్టాడు. 2020 ఫిబ్రవరిలో శ్రీనగర్‌ నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించి జమ్ము, పంజాబ్, హర్యాన, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సైకిల్‌ యాత్ర కొనసాగింది. మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌తో సైకిల్‌ యాత్ర నిలిపివేసి ఇంటికి చేరుకున్నాడు.
చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు

ఆదిలాబాద్‌ నుంచే..
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్‌ పట్టణం నుంచి మళ్లీ సైకిల్‌ యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 33 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు సైకిల్‌ యాత్ర చేపట్టడం జరిగిందని, మరో 20 రోజుల్లో 1,800 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఎల్‌సీ మెంబర్‌ బెజ్జంకి అనిల్‌కుమార్‌ ఈ సైకిల్‌ యాత్రను గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చదవండి: నువ్వంటే క్రష్‌.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్‌ వేధింపులు

మరిన్ని వార్తలు