హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ! 

8 Oct, 2021 01:29 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌కు వైఎస్‌ షర్మిల ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో నామినేషన్లు వేయకుండా రిటర్నింగ్‌ అధికారి అడ్డుకుంటున్నారని.. ఆ అధికారిని వెంటనే తొలగించాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయెల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే రకరకాల కారణాలు చూపుతూ.. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల కోసం రోజుకో రూల్‌ పెడుతున్నారని ఆక్షేపించారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికి వస్తే తిప్పిపంపేస్తున్నారన్నారు. నామినేషన్ల గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. ఈ మొత్తం వ్యవహారం మీద కోర్టుకు వెళ్తామన్నారు.  

ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడం దారుణం పోలీసులు సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడం దారుణమన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు