పెనుబల్లిలో వైఎస్‌ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’

20 Jul, 2021 16:44 IST|Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాష్ట్రంలో ఉన్న పలువురు నిరుద్యోగులతో ఫోన్‌లో వైఎస్ షర్మిల మాట్లాడారు.

జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన వైఎస్ షర్మిల.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టామని, 72 గంటల పాటు అవమానాలను తట్టుకుని నిరాహార దీక్ష కొనసాగించామని తెలిపారు. లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే సీఎం కేసీఆర్ భర్తీ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. వయో పరిమితి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు